మంజీరా ఫిల్టర్ బెడ్ పరిశీలించిన జగ్గారెడ్డి

SRD: సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని మున్సిపాలిటీ ఫిల్టర్ బెడ్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం పరిశీలించారు. ఫిల్టర్ బెడ్‌లో మంజీరా నీటి శుద్ధిని ఎలా జరుగుతుందో అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.