ఒంగోలు సమీపంలో ఒకరు మృతి

ఒంగోలు సమీపంలో ఒకరు మృతి

ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలోని దిగువ లైన్ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్సై మధుసూదన్ రావు మృతదేహాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని గుర్తించిన వారు నేరుగా తమను సంప్రదించాలని ఎస్సై కోరారు.