'ముందుండి నడిపే వాడే నాయకుడు'
MDK: ఆపదలో ఆదుకుంటూ ముందుండి నడిపే వాడే నాయకుడని, ఆ లక్షణాలు మోదీలో ఉన్నాయని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. పాపన్నపేట మండలం కొత్తపేటలో మండల స్థాయి కార్యశాల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా నాయకులు, పదాధికారులు, అధ్యక్షుడు సంతోష్ చారి, కన్వీనర్ డా. రాజేందర్ కుమార్ పాల్గొన్నారు.