తండ్రి లేకపోయినా పట్టుదలతో కానిస్టేబుల్‌గా ఎంపిక

తండ్రి లేకపోయినా పట్టుదలతో కానిస్టేబుల్‌గా ఎంపిక

SKLM: నందిగాం మండలం స్థానిక ఎస్సీ వీధికి చెందిన సీమల లక్ష్మీపతి పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తండ్రి కృష్ణారావు రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూ ఐదేళ్ల కిందట మృతి చెందారు. తండ్రి లేరని దిగులు చెందక అమ్మ తారామణి పర్యవేక్షణలో లక్ష్మీపతి కానిస్టేబుల్ ఉద్యోగం కొరకు బాగా చదివి విజేతగా నిలిచాడు. లక్ష్మీపతి ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.