వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

KKD: గండేపల్లి మండలం సింగరంపాలెంలో మండల పరిషత్ నిధులతో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఫిల్టర్ వాటర్ ప్లాంట్‌ను జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ నేడు ప్రారంభించారు. శుద్ధి చేసిన తాగునీరు గ్రామ ప్రజలకు అందుబాటులోకి రావడం ఎంతో ఆనందకరమన్నారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.