పూడ్చిపెట్టిన శవానికి పోస్ట్‌మార్టం
JN: గంగాపురంలో సురేష్ అనే యువకుడి మృతి అనుమానాస్పందంగా మారింది. కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీశారు. శరీరంపై గాయాలు కనిపించడంతో బంధువులు అతడి భార్య కవితపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శవాన్నికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు.