గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం..

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం..

MHBD: గంగారం మండలంలోని ఏడు బావుల జలపాతంలో ప్రేమ్ కుమార్ (23) శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. గంగారం మండలం పందెం శివారులోని కీకారణ్యం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల అనంతరం ఆదివారం అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడు భద్రాద్రి జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం వాసి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.