మరిపెడలో శ్రమదానంతో పరిసరాలు శుభ్రం చేసిన డిప్యూటీ స్పీకర్

మరిపెడలో శ్రమదానంతో పరిసరాలు శుభ్రం చేసిన డిప్యూటీ స్పీకర్

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో గురువారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్రనాయక్ శ్రమదానం చేశారు. స్థానిక యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పరిసర ప్రాంతాలను పలుగు పారా చేపట్టి శుభ్రం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు.