ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NTR: చందర్లపాడు(M) ముప్పాళ్ళ గ్రామంలో బుధవారం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన వసతి సదుపాయాలను స్వయంగా పరిశీలించిన ఆమె, చిన్నారులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, మెనూ విషయాలను తెలుసుకున్నారు.