ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

JN: పాలకుర్తిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు రాపోలు రాంబాబు మాట్లాడుతూ.. వెయ్యి మాటలు చెప్పలేని భావన ఒక్క ఫోటో మాత్రమే చెప్తుందని, ఫోటో మనకు మధుర జ్ఞాపకాలను అందిస్తుందన్నారు. ఫోటోగ్రాఫర్ లకు పెన్షన్ ఇవ్వాలన్నారు.