'రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ'

E.G: గోకవరం మండలంలో సన్న, చిన్నకారు రైతులకు ఉపాధి హామీ పథకం కింద వంద శాతం రాయితీపై పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు ఏపీవో అప్పలరాజు తెలిపారు. ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. మండలంలో 300 ఎకరాలు లక్ష్యం కాగా, ఇప్పటికే 195 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు ఆయన వివరించారు.