నూనె మళ్లీ మళ్లీ వాడితే పేగు క్యాన్సర్!
రీ-హీటెడ్ ఆయిల్ వాడకం వల్ల కొలోన్ క్యాన్సర్ (పెద్ద పేగు క్యాన్సర్) వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది రెండో స్థానంలో ఉంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే విషతుల్య పదార్థాలే 80 శాతం పేగు క్యాన్సర్లకు కారణమవుతున్నాయి. మాడిపోయిన నూనె వాడకం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి, రక్త ప్రసరణ పూర్తిగా దెబ్బతింటుంది.