రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు
నెల్లూరులో ఎన్టీఆర్ నగర్ వద్ద ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ బైకును ఢీకొట్టడంతో, బైకుపై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.