'ప్రజావాణి' సమస్యలకు త్వరిత పరిష్కారం: కలెక్టర్

'ప్రజావాణి' సమస్యలకు త్వరిత పరిష్కారం: కలెక్టర్

VKB: 'ప్రజావాణి' కార్యక్రమానికి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించి, ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తున్నామని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన ప్రజావాణికి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.