ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ కృషి
NZB: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ కృషి చేస్తుందని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవసాయశాఖలో ఉద్యోగులకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వ్యవసాయ శాఖ ఉద్యోగి ఫణి కళ్యాణ్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.