జలపాతాన్ని పరిశీలించిన కలెక్టర్
PPM: పాచిపెంట మండలం నీలం వలస జలపాతాన్ని జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శనివారం పరిశీలించారు. కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళి జలపాతం పరిశీలించి, అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా సీతంపేట ఐటీడీఎ పీఓ, సబ్ కలెక్టర్ వైశాలి, తదితరులు ఉన్నారు.