కర్రలతో దొంగల హల్చల్.. ప్రజల భయాందోళన

SRD: కంది మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఎర్దనూరులో గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారని సంగారెడ్డి రూరల్ ఎస్ఐ రవీందర్ బుధవారం తెలిపారు. గ్రామంలో గురుమూర్తికి చెందిన బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లారని, సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు చెప్పారు.