ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎర్రబెల్లి
JN: కొడకండ్ల మండలంలోని రంగపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా బిల్లును చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు.