అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్
NZB: అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు CP సాయి చైతన్య తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఈ ముఠా పథకం ప్రకారం పల్సర్ బైక్‌లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 17 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.