విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు
అనకాపల్లి: పట్టణంలోని లలితానగర్‌కు చెందిన విద్యార్థిని అదృశ్యమైంది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 4వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా విద్యార్థిని బయటికి వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. అన్నిచోట్ల వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.