పవిత్ర సంగమంలో ఇంటర్ విద్యార్థి గల్లంతు

పవిత్ర సంగమంలో ఇంటర్ విద్యార్థి గల్లంతు

NTR: ఇబ్రహీంపట్నం మండలంలో శనివారం సాయంత్రం స్నానానికి దిగిన ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. స్థానికంగా ఉన్న పవిత్ర సంగమంలో స్నేహితులతో వచ్చిన నవీన్ (17) అనే యువకుడు నీటిలో మునిగి కనిపించకుండాపోయాడు. పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన అతను కంచికచర్ల దీక్ష కాలేజీలో చదువుతున్నాడు. గల్లంతైన నవీన్ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది.