బీజేపీ ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ
HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 64వ డివిజన్ టేకులగూడెం గ్రామంలో శనివారం బీజేపీ ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మతాన్ని రాజకీయాలకు వాడుకుంటూ అధికారాన్ని కాపాడుకుంటుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.