'భూముల అక్రమించిన వారిపై చర్య తీసుకోవాలి'

NDL: జూపాడు బంగ్లా మండలంలోని 35 బొల్లవరం మత్స్య శాఖ విత్తన క్షేత్ర భూమిని ఆక్రమించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం నందికొట్కూరు వాల్మీకి నగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. మత్స్య శాఖకు సంబంధించిన భూమిని ఆక్రమించుకొని మామిడి మొక్కలు నాటారని పేర్కొన్నారు.