వైభవంగా కార్తీక దీపోత్సవం
JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రాత్రి సామూహిక కార్తీక దీపారాధన వైభవంగా జరిగింది. శ్రీవల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలు దేవస్థానంలోని అభిషేక మండపంలో రంగురంగుల ముగ్గులు వేసి, పూలతో అలంకరించి కార్తీక దీపాలను వెలిగించారు. పవిత్ర కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని మహిళలు విశ్వసిస్తున్నారు.