మండలంలో 'రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో' కార్యక్రమం

సత్యసాయి: గోరంట్ల మండలం నర్సింపల్లిలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ సోమవారం 'రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరచి ప్రజలను మోసం చేసిందన్నారు. అనంతరం ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేసి చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు వివరించారు.