కార్మికులకు అండగా ప్రభుత్వం: మంత్రి పొన్నం

MDK: తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం త్వరలో కార్మికుల కోసం గిగ్ చట్టాన్ని తీసుకొస్తుందన్నారు. 19వ శతాబ్దంలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన రోజు మే డే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల శ్రేయస్సు కోరుకుంటుందన్నారు.