కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ఇబ్బందితో కట్టెల పొయ్యి
MDCL: ఉప్పల్ ప్రాంతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. సరఫరాలో అంతరాయం రావడంతో హోటల్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని హోటళ్లలో తిరిగి కట్టెల పొయ్యిలు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ఖర్చులు పెరగడంతో పాటు వంట సమయం కూడా ఎక్కువ అవుతోందని నిర్వాహకులు వాపోతున్నారు.