'తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి'

'తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి'

SRPT: పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ నరసింహ కీలక సూచనలు చేశారు. వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత రానివారు ఒంటరిగా నీటి వనరుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలను ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.