VIDEO: చల్లా బాబుకు వినతి పత్రం

CTR: పుంగనూరు మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు నాలుగు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. గురువారం మధ్యాహ్నం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చల్లా హామీ ఇచ్చారు.