అభివృద్ధి పనులు ప్రారంభం
KNR: గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో సీసీ రోడ్డు, వివో కార్యాలయ నిర్మాణ పనులను గురువారం సర్పంచ్ గంకిడి సంధ్య రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ మౌలిక వసతులను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చంద్ర రెడ్డి, గ్రామస్థులు, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.