'అధిక మందులు వాడకంతో దిగుబడి తగ్గుతుంది'
VZM: మామిడి దిగుబడి కోసం యూరియా, పొటాషియం, రసాయన మందులు ఎక్కువగా వాడకూడదని DPM ఆనందరసవయ సూచించారు. ఇవాళ మెరకముడిదాం మండలం సోమలింగాపురం యూనిట్ పరిధిలోని కొర్లాం,మెరకముడిదాం గ్రామాలలో మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అధిక మందుల వాడకంతో దిగుబడి తగ్గుతుందని తెలిపారు. దీనికి బదులుగా, మామిడి తోటలకు ఆకు కషాయం, పుల్లటి మజ్జిగ వాడాలన్నారు.