స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

AP: కాకినాడ జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛతా ర్యాలీలో చంద్రబాబు పాల్గొని అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. వారి సమస్యలు తెలుసుకుంటూ, అవసరమైన చర్యలను చేపట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.