బోడుప్పల్లో ఇదీ పరిస్థితి

మేడ్చల్: బోడుప్పల్ పరిధి రామచెరువు వద్ద చెత్త వేయడానికి ప్రత్యేకంగా మూడు చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. అయితే, చెత్త నిండి కింద పడటంతో పాటుగా, చెత్త వేయడానికి స్థలం లేక పరిసర ప్రాంతాలకు వచ్చిన వారు చెత్త డబ్బాల పక్కనే డంప్ చేసి వెళ్తున్నారు. అయినప్పటికీ, చెత్తను తొలగించకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలు క్లీన్ చేయాలని కోరారు.