సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్
VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్ వురికిటి నారాయణరావు, కన్నయ్యపేటలో మరమ్మతులకు గురైన మంచినీటి బోరును శుక్రవారం రిపైర్ చేయించారు. స్థానికులు సమస్యను దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు కండిపల్లి సతీష్ కుమార్, చోల్లంగి శేఖర్, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.