'ప్లాస్టిక్ రహితంగా ఉంచాలనే లక్ష్యం'
ASR: గ్రామాల్లో ఇంటింటికీ వచ్చి చెత్తను సేకరించే స్వచ్ఛ రథాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సూచించారు. శనివారం శరభన్నపాలెం పంచాయతీలో స్వచ్చరథం, పొడి చెత్త, తడి చెత్త వేరు చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలను పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభించిందన్నారు.