భారీగా తగ్గిన చికెన్ ధరలు
MLG: జిల్లాలో చికన్ ధరలు గత వారంతో పోలిస్తే ఈ వారం భారీగా పడిపోయాయి. జిల్లాలోని గత వారం కిలో చికెన్ 370-380 వరకు పలకగా, ప్రస్తుతం రూ.270కి చేరుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ధరలు తగ్గిన బంద్ ప్రకటనతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.