ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దు: మంత్రి

ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దు: మంత్రి

NTR: న్యూరాజేశ్వరిపేటలో డయేరియా కేసులో మూలాలు ఎక్కడున్నాయో కనుక్కొనేందుకు దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ఆర్ఆర్ పేట పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మంత్రి పరిశీలించారు. డయేరియా కేసులకు తాగునీరా, ఫుడ్ పాయిజన్ అన్నది స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని, ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దని సూచించారు.