అందుబాటులో యూరియా: కలెక్టర్

NLR: జిల్లాలో 2471 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. రాబోయే పది రోజులలో 500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్ అధికృత విధానం ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. యూరియా పై రైతుల ఆందోళన చేయాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.