'హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి'
MBNR: జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో హెచ్ఎన్ ఫంక్షన్ హాల్లో మోషన్ ఈ అజార్ మిషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ శిబిరం నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.