లాడ్జి యజమానులకు పోలీసుల సూచనలు
PLD: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి యజమానులతో పోలీసులు సమావేశమయ్యారు. లాడ్జిలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రూమ్ తీసుకునే ప్రతి కస్టమర్ యొక్క పూర్తి సమాచారం (ఆధార్ జిరాక్స్, ఫోన్ నంబర్) తప్పనిసరిగా నమోదు చేస్తూ, రిజిస్టర్‌ను నిర్వహించాలని యజమానులకు సూచించారు.