'ఇండియా'కు కాంగ్రెస్సే భారం: పూనావాలా

'ఇండియా'కు కాంగ్రెస్సే భారం: పూనావాలా

ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని నాయకురాలిగా మార్చాలని పెరుగుతున్న డిమాండ్‌పై బీజేపీ అధికార ప్రతినిధి పూనావాలా స్పందించారు. ఈ కూటమిలోని పక్షాలకు రాహుల్ గాంధీపై నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. తప్పంతా రాహుల్ దగ్గరే ఉందని.. కాంగ్రెస్ ఇంకెప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ భారంగా మారిందన్నారు.