లైబ్రరీలో ఉత్సాహంగా వేసవి శిక్షణ శిబిరం

ELR: నూజివీడులోని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహ భరితంగా కొనసాగింది. గ్రంథాలయాధికారి బిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశ్వసేవా మూర్తి మధర్ థెరిస్సా జీవిత విశేషాలు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులతో పుస్తకాలు చదివించి, త్యాగధనుల జీవితాలు ఆదర్శమన్నారు. నిత్యం గ్రంథాలయాలలో చదువుకోవడంతో బంగారు భవిత ఏర్పడుతుందన్నారు.