తుళ్లూరులో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

తుళ్లూరులో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

GNTR: పెండింగ్‌లో ఉన్న తమ జీతాలను వెంటనే చెల్లించాలని పారిశుద్ధ్య కార్మిక సంఘం రాజధాని ప్రాంత ఏరియా గౌరవాధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. శనివారం పని విరామం సమయంలో తుళ్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. జీతాలు లేకపోవడంతో కార్మికులు అర్ధాకలితో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారంలోగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.