'బాల్య వివాహాలను అరికట్టాలి'

'బాల్య వివాహాలను అరికట్టాలి'

SRPT: బాల్య వివాహాల నిర్మూలనలో తల్లిదండ్రులు, గ్రామస్థులు బాధ్యతగా వ్యవహరించాలని, ఐసీడీఎస్ నడిగూడెం మండల సెక్టార్ సూపర్వైజర్ సరిత సూచించారు. గురువారం నడిగూడెం మండల కేంద్రంలోని 4వ అంగన్వాడీ కేంద్రంలో బాల్యవివాహాల నిర్మూలనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బడి ఈడు పిల్లలను బడికి పంపాలని పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు.