'విద్యార్థుల్లో కనీస సామర్ధ్యాలు పెరగాలి'

'విద్యార్థుల్లో కనీస సామర్ధ్యాలు పెరగాలి'

SRD: ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస సామర్ధ్యాలు పెంచేలా చూడాలని సదాశివపేట ఎంఈవో శంకర్ సూచించారు. మండలంలోని నంది కంది, గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ చదవడం, రాయడం రావాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.