ఎగ్ కార్ట్ యూనిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఎగ్ కార్ట్ యూనిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: చేబ్రోలు మండలం మంచాలలో ఎగ్ కార్ట్ యూనిట్‌ను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బుధవారం ప్రారంభించారు. మహిళా సంఘం సభ్యురాలు బుర్రి శివపార్వతికి ఈ-యూనిట్‌ను మంజూరు చేశారు. సెర్ప్(SERP) సహకారంతో రూ.50 వేల పూర్తి సబ్సిడీతో ఆమెకు దీనిని అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, వారి జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఈ సాయం అందించినట్లు నాయకులు తెలిపారు.