పసుపు సాగును సందర్శించిన ఎంపీ అర్వింద్

పసుపు సాగును సందర్శించిన ఎంపీ అర్వింద్

NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు.