త్రిలింగేశ్వర ఆలయానికి లక్ష విరాళం
KMR: నాగిరెడ్డిపేట్ త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సోదరి శోభ తరఫున రూ.1 లక్ష విరాళం అందజేశారు. సోమవారం ఎమ్మెల్యే తల్లిదండ్రులు వజ్రమ్మ–రాజేశ్వరరావు దంపతులు ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి నగదును ఆలయ కమిటీకి అందించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమ యాదగౌడ్ ఉన్నారు.