సయోధ్య స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నీటి సమస్యకు పరిష్కారం
VKB: కుల్కచర్ల మండల పరిధిలోని సాల్విడ్ గ్రామంలో చెంచుల కాలనీలో సయోధ్య స్వచ్ఛంద సంస్థ వారి అనుసంధానంతో 12 బోర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థ సభ్యులు, పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.