కుట్టుమిషన్లు కుంభకోణంపై విచారణ చేయాలి: కారుమూరి

W.G: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలకు అందించే కుట్టు మిషన్ల కుంభకోణంలో సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కుట్టు మిషన్ల కుంభకోణంలో రూ. 157 కోట్లు అవినీతి జరిగిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.